స్పీకర్గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా టీడీపీ నేతలు అంటున్న మాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బహూశ టీడీపీ లో కోడెల చేసిన నేరాలు ఎవ్వరు చెయ్యలేదు..ఒక్కొక్కటి బయటపడుతుంటే మా పార్టీ కి అతి పెద్ద చెడ్డ పేరు తెచ్చిపెట్టాడు..అరెస్ట్ అవ్వాల్సిందే అంటు తెగ ట్రోల్ చేస్తున్నారు. వాయ్యో ఒకట , రెండా రోజు రోజుకు కోడెల అక్రమాలన్ని బయటపడేకొద్ది టీడీపీ నేతలు ఇలాంటి నేరాలు ఇంకా ఎన్ని చేశారో అని ఏపీ ప్రజలు దుమ్మేతిపోస్తున్నారు.
