టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్నది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మొదటి సీజన్ కు గాను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా. రెండో సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసాడు. ఈ రెండు సీజన్లు కూడా బాగానే వ్యవహరించారు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్-3 కి వచ్చేసరికి మాత్రం ఎన్నో వివాదాలతో మొదలైంది. దీనికి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరిస్తున్నాడు. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఈ సారి మరీ దారుణంగా ఉందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే హౌస్ లో సభ్యులు అందరు బజార్ లో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారనే అనాలి. ప్రతీరోజు ఏదోక గొడవ పెట్టుకుంటున్నారు. దీంతో దీనికన్నా ముందు రెండు సీజన్లే మంచిగా ఉన్నాయని అందరు భావిస్తున్నారు. దీని పూర్తి భాద్యత నాగ్ తీసుకుంటాడా అనేది ఇప్పుడు ప్రశ్న..?
