మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13 మధ్య ఒకసారి పార్లమెంటులో ఆనాటి టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు మీ నాయకుడు (బాబు) నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున కూర్చున్నాడు నామా.ఢిల్లీలో సుజన్ చౌదరి గెస్ట్ హౌస్ లో చిదంబరం కాళ్ళు పట్టుకొని తన మీద కేసులు కొట్టేయించుకున్నాడు బాబు అని కెసిఆర్ ప్రెస్ మీట్ లో చెప్పాడు.చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని కేసుల నుంచి బయటపడ్డాడు అని ఢిల్లీ ఇంగ్లీష్ మీడియా రాసింది. సోనియా కోరిక మేరకు జగన్ మీద కేసు వేసిన శంకర్ రావు శంకరగిరి మాన్యాలు పట్టాడు. సోనియా రాహుల్ ల కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊడ్చుకుపోయింది. రాష్ట్రంలో రెండు సార్లు ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించి, ఇక్కడి 30 కి పైగా గెలిచినా కాంగ్రెస్ ఎంపీ ల మద్దతు తో కేంద్రం లో రెండు సార్లు ఏర్పడటానికి కారణమయిన వైఎస్ మరణం తరువాత జగన్ కాంగ్రెస్ ను వీడాడనే కక్షతో కేసులు పెట్టి జైలు లో వేయించి ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక జగన్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ తో చేతులు కలిపి జగన్ మీద కేసులు వేసిన బాబు నేడు తెలంగాణ లో పార్టీ మూసుకున్నాడు, ఒక ఏపీ లో బీజేపీ లో విలీనానికి రెడీ అవుతున్నాడు. ఇక చిదంబరం పరారిలో ఉన్నట్టు సమాచారం.
