తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రోరైల్ ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త. ప్రయాణికుల కోసం తగిన సౌకర్యాలను అందిస్తున్న మెట్రో ఇప్పుడు చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ మధ్య ప్రతి 4 నిమిషాలకు మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచిచూడాల్సిన అగత్యం తప్పింది. ఇప్పటివరకు ఆ మార్గంలో ట్విన్ సింగిల్‌లైన్ మెథడ్ కారణంగా ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉండేది. మంగళవారం నుంచి ఆ మార్గంలో రివర్సల్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచి ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మార్గం సుగమమైందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Tags ameer pet cm GHMC hightech city hmrl jublieehills kcr ktr metro slider telanganacm telanganacmo