తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మెడలో మరో మణిహారం చేరనుంది. ఇ-కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థ అమెజాన్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రపంచంలోనే అతిపెద్దది.
పదివేల మందికి ఉపాధి కల్పించేలా పది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ప్రాంగణం బుధవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, సంస్థ స్థిరాస్తి, వసతుల విభాగం సంచాలకుడు జాన్ స్కోట్లర్ కూడా పాల్గొంటారు.