ఓటరు కార్డుల్లోని ఫేక్ కార్డులు తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రయత్నాలు చేపట్టింది.. ఒక మనిషికి ఒకటికంటే ఎక్కువ ఉన్న ఓటరు కార్డులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతీవ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని EC తాజాగా కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని, దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయని, ఈపరిస్థితి తొలగాలంటే, ఆధార్ అనుసంధానమే మార్గమని EC అభిప్రాయపడింది. ఆధార్ వివరాలు అనుసంధానం చేయడానికి కచ్చితంగా 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి మార్పులు చేయాలని గుర్తు చేస్తూ న్యాయశాఖకు ఈసీ లేఖను కూడా రాసింది.
Home / NATIONAL / దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.. మరి కేంద్రం ఒప్పుకుంటుందా
Tags aadhar card election commission India link up voter id voters
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023