రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఇకపై ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈఏడాది మొత్తం 5,500 షాపుల నుండి 3,500 మద్యం షాపులకు ప్రభుత్వం తగ్గించింది. అంతేకాకుండా దీనికి సంభందించి ఉదయం 10 నుండి రాత్రి 9 వరకే మద్యం అమ్మకం జరగాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ చెప్పినట్టుగానే మద్యం అమ్మకం సమయం 15శాతం తగ్గించడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 30శాతం షాపులు కూడా తగ్గించారు. దీంతో జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై సర్వత్రా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
