న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ సత్తారట్‌వైట్ (33) తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది. గర్భవతిగా ఉన్నానని తనకు విశ్రాంతి కావాలని అమీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది. దీంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అమీకి విశ్రాంతి అనుమతి ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్‌ను రద్దు చేయకుండా పారితోషికం ఇస్తామని ఎన్‌జడ్‌సి(NZC) అధ్యక్షుడు డేవిడ్ తెలిపాడు. ఈ సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ సంఘం తనకు సహాయ సహకారాలు అందిస్తుండడంతో ఆమె ధన్యవాదాలు తెలిపారు.న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వనున్న 2021 లో జరిగే ప్రపంచ కప్ కోసం జట్టులోకి తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు సత్తారట్‌వైట్ చెప్పారు. అయినప్పటికీ, విరామ సమయంలో ఆమె జట్టుకు “గురువు” గా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆమె జట్టుకు గైడ్‌గా పని చేస్తానని వివరించింది. ఇప్పటి వరకు ఆమె 119 వన్డేలతో పాటు 99 టి-20 మ్యాచ్ లు న్యూజిలాండ్ జట్టు తరఫున ఆడింది. 116 వన్డేలలో 114 వికెట్లు పడగొట్టి పాస్టెస్ట్ బౌలర్‌గా పేరు సంపాదించింది.