మెగాస్టార్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 151వ సినిమా సైరా టీజర్ మంగళవారం మధ్యాహ్నం 2.40 గంటలకు విడుదలకానుంది. చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకి అద్భుతమైన స్పందన రావడంతో టీజర్ ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరుని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో తనయుడు చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే టీజర్ విడుదలైన తర్వాత ఎన్ని వ్యూస్ వస్తాయో ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు. సైరా టీజర్ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమంటున్నారు.
