టీడీపీలో ఫైర్ బ్రాండ్ లు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు చెబు తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ..వైసీపీ మీద ప్రధానంగా నాటి ప్రతిపక్ష నేత జగన్ మీద విరుచుకుపడిన టీడీపీ ఫైర్ బ్రాండ్లు పార్టీని వీడుతున్నారు. అందులో ఎన్నికల సమయంలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతలు యామినీ ఇప్పటికే బీజేపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. తాజాగా మాజీ సినీ నటి.. టీడీపీ నేత దివ్యవాణి సైతం పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించి..కొద్ది కాలం క్రితం బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు దివ్యవాణీని బీజేపీలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందుకు దివ్యవాణీ సైతం అంగీకరించారని సమాచారం. త్వరలోనే దివ్య వాణి బీజేపీ తీర్దం పుచ్చుకోవటం ఖాయం అంటున్నారు. అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ధీటుగా మాట్లాడగలిగిన మహిళా నేతలు ఇప్పుడు టీడీపీలో ఎవరూ కనిపించటం లేదు. ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష సమయంలో ప్రధాని మోదీ..బీజేపీ..వైసీపీ నేతల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక, ఏపీలోని వైసీపీ నేతల మీద అనేక సార్లు ఫైర్ అయ్యారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ మహిళగా చెప్పిన వారు ఉన్నారు. అయితే, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోనే టీడీపీ వీడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందులో బాగాంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైయ్యింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కు ధీటుగా ఇప్పుడు టీడీపీలో ఎవరున్నారనే చర్చ మొదలైంది. వైసీపీలో ఎమ్మెల్యేగా చంద్రబాబు..లోకేశ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటంలో పార్టీలో తొలి స్థానంలో నిలిచారు నగరి ఎమ్మెల్యే రోజా. టీడీపీ హయాంలో అసెంబ్లీలో రోజాను ఎదుర్కోవటానికి పీతల సుజాత.. వంగలపూడి అనిత ను టీడీపీ అస్త్రాలుగా ఉపయోగించేంది. వారిద్దరూ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక, వాణీ విశ్వనాద్ .. యామినీ.. దివ్య వాణీలు పోటీగా ఉంటారని టీడీపీ భావించింది. అయితే వారు రోజా మీద ఆ స్థాయిలో ఆరోపణలు చేయలేదు. ఇక, ఇప్పుడు ఆ ఇద్దరు మహిళా నేతలు సైతం టీడీపీని వీడుతుండటంతో ఇక, వైసీపీ ఫైర్ బ్రాండ్ కు ధీటుగా టీడీపీలో బలమైన వాయిస్ ఉన్న మహిళా నేతలు కనిపించటం లేదు.
