ఇటీవల పవన్ ఇచ్చిన ఓ అధికార ప్రకటనపై వైసీపీ సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. దీనికి సంబంధించి వారు పవన్, జగన్ ల రాజకీయ చరిత్రలను ఉటంకించి మరీ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.పవన్ ప్రజారాజ్యం ద్వారా, జగన్ కాంగ్రెస్ ద్వారా ఇద్దరూ 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. జగన్ రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా రాణించి 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి 151 ఎమ్మెల్యే, 22 ఎంపీలతో ఒంటిచేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
పవన్ యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, 2014 ఎన్నికల ముందు జనసేన పెట్టి కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీచేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చి వాళ్ళని తానే గెలిపించాననే భ్రమల్లో తేలిపోతూ 2019ఎన్నికలో వామపక్షాలు, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకుని తాను పోటిచేసిన రెండుచోట్లా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక పిచ్చిగా జగన్ రెడ్డి అంటూ కుల రాజకీయాలు చేస్తూ గడిపేస్తున్నాడు.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సమస్యలు వచ్చినా కనీసం స్పందించకుండా కేవలం చంద్రబాబు ఇంటిపై డ్రోన్ తిప్పగానే ఏకంగా పార్టీ లెటర్ హెడ్ విడుదల చేసి మరీ చంద్రబాబుపై తన ప్రేమను చాటుకున్నాడు.. దీనిపైనే వైసీపీ విమర్శలు సంధిస్తోంది.. జగన్ సాధించిన దానిలో కనీసం 10శాతం సాధించాలన్నా పవన్ కి 100 ఏళ్ళు పడుతుందని, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని ఓ పవన్ ఇకనైనా చంద్రబాబుకు బానిసత్వం ఆపకపోతే తమరికి ఉన్న ఆ కొద్దిపాటి గౌరవం కూడా గంగలో కలిసిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అలాగే 23సీట్లు వచ్చినోడు కూడా మీడియా ముందుకు రావడానికి సిగ్గుపడుతుంటే తమరు మాత్రం మీ పొలిటికల్ పార్టనర్ మీద ఈగ వాలనీయట్లేదేంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలో జగన్ పై హత్యాయత్నం సమయంలో ఆయన హైదరాబాద్ వెళ్లిపోతే హేళన చేసి ఇవాళ ఒక డ్రోన్ కెమెరా గురించి చంద్రబాబు కంటే ఎక్కువ నలిగిపోతున్నావంటూ విమర్శిస్తున్నారు. తాజా ఘటనలతో నీలాంటి వాడ్ని అభిమానించినందుకు మా మీద మాకే అసహ్యం వేస్తోందంటూ పలువురు జనసైనికులు కూడా ఆపార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.