నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎంతో వైభవంగా సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అభిమానులతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇక ప్రభాస్ కి సంభందించి ఒక విషయంలో ఇటు సోషల్ మీడియా అటు నేషనల్ మీడియాలో కూడా జోరుగా నడుస్తుంది. అదేమిటంటే ప్రభాస్ పెళ్లి గురించే. ఇటు మీడియా అటు ఫ్యాన్స్ అందరు కూడా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని ఇప్పటికే పలు కధనాలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఒక ఎన్నారై అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ప్రభాస్ ఒక జాతీయ మీడియా కు ఇంటర్వ్యూ ఇస్తూ అనుష్క నాకు ఒక స్నేహితురాలే అని క్లారిటీ ఇచ్చాడు. నా పెళ్లి గురించి ఇంకా క్లారిటీ లేదని.. ఏమో లవ్ మ్యారేజ్ నే చేసుకోవచ్చేమో అని ఆసక్తికరంగా స్పందించాడు.
