తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా జగద్విఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు..
తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్‌స్కేర్‌లోని భారీ తెరపై కాంతులీనింది. తెలంగాణ ఇంజినీరింగ్ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్ విజువల్స్‌ను టైమ్స్‌స్కేర్ కూడలిలోని తెరపై మూడురోజులపాటు రోజుకు ఐదుసార్లు చొప్పున ప్రదర్శిస్తున్నారు.
బాహుబలి మోటర్లుగా పిలుస్తున్న 139 మెగావాట్ల భారీ మోటర్లు ఎత్తిపోసిన నీళ్లు డెలివరీ సిస్టర్న్‌నుంచి కిందికి దుంకుతున్న దృశ్యాలతోపాటు.. గ్రావిటీ కెనాల్‌ద్వారా నీరు పారుతుండటాన్ని ఆ వీడియోలో చూపారు. లక్ష్మీపూర్ సర్జ్‌పూల్, భూగర్భంలోని భారీ మోటర్లు, పంప్‌హౌస్ దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.
Post Views: 285