ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. i have a dream అంటూ మార్టిన్ లూథర్ కింగ్ మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన జగన్ మాటలకు ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.. అందుకు స్ఫూర్తిగా ‘నాకు కూడా ఒక కల ఉంది ‘ అంటూ పాదయాత్ర ద్వారా తను చూసిన కష్టాలకి ప్రతిరూపంగా రూపుదిద్దుకొన్న నవరత్నాలని జగన్ వివరించటం జరిగింది. జగన్ మాట్లాడిన ప్రతీ మాట ఎంతో నిజాయితీగా గుండె లోతుల్లోనుండి వచ్చిందని ప్రవాసాంధ్రులు మంత్ర ముగ్దులయ్యారట. యువకులు ,మహిళలు , చిన్నపిల్లలు , ఆఖరికి వృద్దులు కూడా తమ అభిమాన నేతతో కరచాలనం చేయడం అంత చిన్న వయస్సులో ఇంతటి అభిమానాన్ని పొందటం అద్భుతమని అమెరికన్లు చర్చించుకున్నారు, అయితే జగన్ సభను అడ్డుకునేందుకు టీడీపీ ఎన్నారైలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు..
సభ జరుగుతున్న డౌన్ టౌన్ లో స్థానిక సమస్యలపై ధర్నా జరుగుతుందని, అక్కడకి ఎవ్వరినీ రానివ్వటం లేదని దాంతో జగన్ సభకూడా రద్దయిందని పెద్దఎత్తున ప్రచారం చేసారు. అంతేకాదు.. డల్లాస్ లోని ఆ ఆడిటోరియం వద్దకు వెళ్తే ఇబ్బందులు పడతారని కొంతమంది ప్రజలని తప్పుదోవ పట్టించటానికి సోషల్ మీడియా ద్వారా కూడా విష ప్రచారం చేసారు. అయినా స్థానిక తెలుగు ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా అంచనాలకి మించి హాజరవటం అందరినీ ఆశ్చర్యానికు గురి చేసింది. అలాగే సభ పెద్దఎత్తున సక్సెస్ అవడంతో టీడీపీ ఎన్నారైలు చేసిన ప్లాన్లు మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యాయని వైసీపీ ఎన్నారైలు సంబరాలు చేసుకుంటున్నారు.