తన వ్యాఖ్యలతో తనూ ఒక రాజకీయ నేత అనే గుర్తింపును సంపాదించుకున్నమహిళ నాయకురాలు సాదినేని యామినీ. నోటిదురుసే ఈమెకు గుర్తింపును సంపాదించి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యామిని పరుషపదజాలంతో రెచ్చిపోయారు. దీంతో ఈజీగా గుర్తింపు వచ్చేసింది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగింది. ఈమె ఎవరు? ఈమె కథేంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడించింది. గాసిప్పులు కూడా క్రియేట్ అయ్యాయి. అంతేకాదు నారాలోకేష్ పై ఈగ వాలకుండా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. 2019 ఎన్నికల ముందు వరకు ఎప్పటికప్పుడు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీపై..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్రమైన ఘాటు వాఖ్యలు చేసింది. నారా లోకేష్ పై ఎవ్వరైన కౌంటర్ వేస్తే వేంటనే రియాక్ట్ అయ్యి వారిని ఓ రెంజ్ లో అంటే ఒక గంట సేపు క్లాస్ ఇస్తుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఈమె తెరమరుగు అవుతూ వస్తున్నారు. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి అన్నట్టుగా యామిని వెళ్లి బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను వెళ్లి కలిసింది. తద్వారా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కన్నాను కలవడంతో యామిని బీజేపీలోకి చేరబోతోందని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.మొన్నటి వరకూ టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని హద్దూ అదుపుల్లేకుండా మాట్లాడిన ఈమె ఉన్నఫలంగా కమలం వాళ్లతో కనిపించడం ఆశ్చర్యకరమైన అంశంగా మారింది. దీనిపై ఆమె స్పందించాల్సి ఉంది. లోకేష్ భజన చేస్తూ బీజేపీని తిట్టిన ఈమె ఆ పార్టీలోకి చేరబోతున్నట్టేనా? ఇలాంటి ఫాలోయర్లే పార్టీ మారిపోతే అప్పుడు లోకేష్ పరిస్థితి ఏమిటి? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత యామినీ సాదినేని తెరమరుగు అయిన పరిస్థితి నుంచి కన్నాను కలవడం ద్వారా ఒక్కసారి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇంతకీ పార్టీ మారుతున్నట్టా లేదా అనే అంశం గురించి ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది!
