ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కార్యక్రమానికి మంత్రులు జగదీష్ రెడ్డి ,ప్రశాంత్ రెడ్డి , ఎంపీ లింగయ్య యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడారు.
మూడు సార్లు ఎంపీ గా ఎన్నికయిన తనకు ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చిన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కేటీఆర్ తో సహా అందరికీ ధన్యవాదాలు చెప్పారు.