టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్ ఆపరేటర్ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే …ఎన్సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైర్లు కత్తిరించి ఎన్సీవీని కబ్జా చేశాడు. దీంతో ఎన్సీవీ కేబుల్ వైర్లు కోడెల ఇంటి ముందు పడేసి సోమవారం ఆందోళనకు దిగారు. ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చారంటూ శివరామకృష్ణపై విమర్శలు చేశారు. కమ్మ హాస్టల్ నిర్మాణంలోనూ భారీగా అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏపీ మొత్తం అయ్యా కోడెల..ఎన్ని నేరాలు చేశావయ్యా అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతున్నారు.
