జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చిదంబరం, ఆజాద్ లాంటి మాజీ కేంద్ర మంత్రులు ఆర్టికల్ 370 రద్దు చేయడం మహా ఘోరం, పాపం అన్నట్లుగా మోదీ, అమిత్‌షాలపై తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీర్ మినహా లడఖ్‌తో సహా దేశమంతటా హర్షం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే కొంత మంది కాంగ్రెస్ నేతలు మాత్రం పార్లమెంట్‌లో ఆర్టికల్ 370 రద్దుపై జరిగిన చర్చలో పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మోదీ సర్కార్‌కు మద్దతు పలికారు. దీంతో ఆర్టికల్ 370 రద్దు విషయం లాంటి కొన్ని విషయాల మీద కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఉందనే విషయం తేలిపోయింది. సైద్ధాంతిక అంశాల మీద తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలం అయింది. తాజాగా ఆర్టికల్ 370 రద్దుపై హర్యానా మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా సంచలన వ్యాఖ్యలు చేశారు. . ఆర్టికల్ 370 నిర్వీర్యంపై తన పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన.. కాంగ్రెస్ గతంలో మాదిరి లేదన్నారు. కాంగ్రెస్ తన మార్గాన్ని మర్చిపోయిందని.. ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 నిర్వీర్యంపై మా పార్టీ వారు పూర్తిగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మునుపటి మాదిరి లేదు.. దేశ భక్తికి సంబంధించి.. ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో నేను ఎవరి మాటా వినని భూపిందర్ సింగ్ హుడా తేల్చేశారు. తాను దేశభక్తుల ఫ్యామిలీలో పుట్టానని.. జాతీయ అంశాల విషయంలో ఎవరి మాటా తాను వినని తేల్చి చెప్పిన ఆయన.. ఆర్టికల్ 370పైన బీజేపీ స్టాండ్ కు మద్దతు ప్రకటించారు. మొత్తానికి ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ నేతలు తలో ఒక రీతిలో వ్యవహరిస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలా లేదా..మద్దతు పలకాలా అన్న విషయంలో కాంగ్రెస్ నేతల్లో అయోమయం నెలకొంది. మొత్తంగా ఆర్టికల్ 370 రద్దు బీజేపీకికి మద్దతు పలికి..సొంత పార్టీకే కి షాక్ ఇచ్చాడు…హర్యానా మాజీ సీఎం. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ మాజీ సీఎం వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో తెలియక…మౌనంగా ఉండిపోయింది.