ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నారు. రాజకీయ భవిష్యేత్తు కోసం టీడీపీ నాయకులూ పార్టీ మారుతున్నారు. మరికొందరు నాయకులూ వారసత్వం రాజకీయాల్లో ఉండాలంటే పార్టీ మారాల్సిందే అని బీజేపీలోకి చేరుతున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ మీద ఈగ కూడా వాలనివ్వనంత అభిమానం ఉన్న మహిళా నాయకురాలు సాదినేని యామిని కూడా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రత్యామ్నాయంగా భారతీయ జనతాపార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. కమలం పువ్వు కండువాను కప్పుకోవడానికి ఆమె మంచి ముహూర్తాన్ని చూసుకోవడమే మిగిలి ఉందట. అయితే ఆమె పార్టీ మారుతార లేదా అనేది ఇంకా ప్రశ్నార్ధకం అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలపై వచ్చే కొన్ని కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ మీద ఈగ కూడా వాలనివ్వనంత అభిమానం ఉన్న మహిళా నాయకురాలిగా సాదినేని యామినికి గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు తరచూ చెబుతుంటాయి. అంత అభిమానం ఉన్న యామిని పార్టీ ఎందుకు మారుతుందో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంకా జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ పై మల్లేపువ్వులు నలుపుతాడు అనే మాటతో రాజకీయాల్లో హీట్ పెంచిన సాదినేని యామిని..ఇప్పుడు కమలం పువ్వు ఎందుకు పట్టుకుందో అర్థం అవుతుందా నారా లోకేష్ అంటు కామెంట్స్ పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ డైహార్డ్ ఫ్యాన్ గా సాదినేని యామినికి పేరుందని పార్టీ నాయకులు చెబుతున్నారే..మీరు పార్టీ మారితే ఏమాంటారో మీరు ఉహించారా అని అడుగుతున్నారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం అండతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సహా వైసీపీకి చెందిన దాదాపు అన్ని స్థాయిల్లో ఉండే నాయకులపై ఆమె నిప్పులు చెరిగి ఇప్పుడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడం దేనికి యామిని అంటు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతున్నారు.
Tags andrapradesh comments sadineni yamini social media viral