Home / ANDHRAPRADESH / బుద్ధా వెంక‌న్న ఆత్మ‌హ‌త్య‌…మంత్రి అనిల్ సంచ‌ల‌న కామెంట్‌

బుద్ధా వెంక‌న్న ఆత్మ‌హ‌త్య‌…మంత్రి అనిల్ సంచ‌ల‌న కామెంట్‌

టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న  సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో చంద్ర‌బాబు ఇంటివ‌ద్ద డ్రోన్ల ప‌ర్య‌వేక్ష‌ణ విష‌యంలో ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, ఆ కుట్రలు ఆపకపోతే జగన్‌ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్ర‌క‌టించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి‌ వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని హైకోర్టు భద్రత పెంచాలని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు.

అయితే, వెంక‌న్న కామెంట్ల వెనుక అస‌లు నిజాన్ని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్ల‌డించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడేందుకే బుద్దా వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవాల ఆధారంగా రాజకీయం చేయాలి.. కానీ, సంచలనం సృష్టించే కామెంట్లు ఏంటని ప్ర‌శ్నించారు. ఏదో కామెంట్ చేసేందుకు ప్ర‌క‌టించారే కానీ, బుద్దా వెంకన్న నిజంగా ఆత్మహత్య చేసుకోరనే విషయం అందరికీ తెలిసేంద‌ని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తన కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని చంద్రబాబు తనకు ప్రమోషన్ ఇస్తారని బుద్దా వెంకన్న భావించి ఉంటారంటూ పంచ్‌లేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat