Home / MOVIES / ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో అర్జున్ రెడ్డి..!-హీరోయిన్ క్లారీటీ..!

ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో అర్జున్ రెడ్డి..!-హీరోయిన్ క్లారీటీ..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువతలో ముఖ్యంగా యువతీ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న పేరు..అర్జున్ రెడ్డి మూవీతో యువత మదిని దొచుకుంటే కామ్రేడ్ మూవీతో మహిళా ప్రేక్షకుల మదిలో సువర్ణక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ఫిల్మ్ నగర్లో వ్యాప్తిచెందుతున్న వార్తలు. ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈవార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తనతో కల్సి నటించిన రష్మిక మంధానతోనే ఈ హీరో ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే తమ గురించి వస్తున్న వార్తలపై రష్మిక మంథాన స్పందించారు. ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” తనకు విజయ్ దేవరకొండకు మధ్య ఎటువంటి సంబంధం లేదు. కేవలం కొంతమంది తమ పత్రికలకు,మీడియా ఛానెళ్లకు రేటింగ్ కోసం ఇలా రాస్తోన్నారు. విజయ్ నాకు మంచి స్నేహితుడు అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే కాలమే సమాధానం చెప్పాలి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అన్నదానికి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat