F2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా వెంకీ మామ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకీ మామగా వెంకటేష్ నటిస్తుండగా అల్లుడిగా నాగచైతన్య అలరించనున్నాడు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు, రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండడంతో ఈ సిన్మాపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాగా ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్గా ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రామోజీ ఫిలిం సిటీలో ఓ పాట చిత్రీకరణ సందర్భంగా వెంకటేష్ గాయపడ్డారు. వెంకీ కాలు బెణకడంతో డాక్టర్లు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. వెంకటేష్ కు గాయమైందనే వార్తలతో ఫ్యాన్స్ తొలుత ఆందోళన చెందినా …గాయం మరీ పెద్దది కాకపోవడంతో ఊరట చెందారు. తమ అభిమాన హీరో వెంకీ తొందరలో కోలుకోవాలని, మూవీ తొందరగా రిలీజ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.