గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై బాబుగారి పుత్రరత్నం లోకేష్.. వరుస ట్వీట్లతో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపు గురైంది. అయితే వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవను అడ్డుపెట్టి వరదను దారి మళ్లించి…తమ ఇల్లు వరద నీటిలో మునిగేలా చేశారంటూ..ఓట్వీట్ చేశాడు చినబాబు. దీంతో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కొద్ది రోజులుగా లోకేశ్ పలు అంశాలపై ట్విటర్లో చేసిన వ్యాఖ్యలపై విజయ సాయిరెడ్డి ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ”పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగా. చంద్రబాబు ఇల్లు మునగాలని (కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్ కనిపించింది. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది. లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుందని” విజయ సాయిరెడ్డి నారా లోకేశ్‌ను ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేశారు. ”అన్నక్యాంటీన్ల బకాయిలు వంద కోట్లు మీరు దోచుకున్న సొమ్ము నుంచి చెల్లిస్తే ఇప్పుడే తెరుచుకుంటాయి. రెండు లక్షలు ఖర్చయ్యే షెడ్డుకు 30-40 లక్షలు దండుకున్నారు. ఆ డబ్బును తిరిగిచ్చినా ఐదేళ్ల పాటు నడుస్తాయి. కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. భ్రమరావతి అనే ‘ప్రపంచ నంబర్ వన్’ రాజధానిలో ఉన్న నాలుగు భవనాలకు స్వాతంత్ర దినోత్సవం రోజు లైటింగ్ ఏర్పాటు చేస్తే ఇంతగా మురిసి పోవడం ఏమిటి బాబు గారూ? కరకట్ట అక్రమ నివాసం మునిగిపోవడం, తమరు హైదరాబాద్ పలాయనం చిత్తగించడం. దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్.” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మొత్తంగా గత కొద్ది రోజులుగా లోకేష్ చేస్తున్న ట్వీట్లకు విజయసాయిరెడ్డి ఒక్కట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు. దీంతో తండ్రీ కొడుకుల మైండ్ బ్లాక్ అయిందని నెట్‌జన్లు బాబు, లోకేష్‌లపై సెటైర్లు వేస్తున్నారు.