యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’ . ప్రభాస్ బాహుబలి తర్వాత తీస్తున్న మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్నాడని చెప్పాలి. ఈ చిత్రానికి గాను సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా కొన్ని సాంకేతిక కారణాలు వల్ల ఈ నెల 30కు మార్చడం జరిగింది. ఇప్పటికే వచ్చిన చిత్ర సాంగ్, ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ఫాన్స్ కు మంచి జోష్ ని తెప్పించాయి. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుల్లో ఏ సినిమా తీస్తున్న ముందుగా ఆ చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్లు తో బిజీగా ఉంటున్నారు. ఇదే తరహాలో సాహో టీమ్ కూడా ఫుల్ బిజీలో ఉంది. హీరో ప్రభాస్, శ్రద్ధా కపూర్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. పెద్ద పెద్ద హీరోలు కూడా ఇదే ఫాలో అవ్వడంపై నేటీజన్లు సేటైర్లు వేస్తున్నారు.
