తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.. ఆ వీడియోలో పంచాయతీ పెట్టి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించిన గ్రామ పెద్ద ఓ దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిగా చెప్తున్న బాలికను గొడ్డును బాదినట్లు బాదాడు.. దారుణంగా కొట్టడం.. కాలితో ఇష్టానుసారంగా తన్నడం.. నెట్టేయడం, నీచంగా బూతులు తిట్టడం ఒకటేంటి ఇలా ఆ అమ్మాయిని హింసించాడు.. నాగరిక సమాజంలో బతుకుతున్న ఒక మనిషి చేయకూడని పనులన్నీ చేశాడు.. అమ్మాయనే ఇంగితం కూడా లేకుండా పశువులా ప్రవర్తించాడు.. ప్రాధమిక సమాచారం మేరకు ఈ ఘటన అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం పీకే దొడ్డి గ్రామంలో జరిగిందట.. దళిత కులానికి చెందిన ప్రేమజంట వ్యవహారాన్ని పంచాయితీ పెట్టి పరిష్కరించే క్రమంలో గ్రామ పెద్ద ఇలా పైశాచికంగా ప్రవర్తించాడు..
నేటి సమాజంలో పంచాయతీ పెద్దలు ఇలా దాడి చేయడమేంటని అందరూ నిలదీస్తున్నారు.. ఇలాంటి ఆటవిక సంస్కృతి కొనసాగకుండా ఉండాలని, సదరు పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కనీస మానవత్వం చూపించకుండా కేవలం ఇద్దరు యువతీయువకులు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనే ఒకే ఒక్క కారణంతో ఇంత దారుణానికి ఒడిగట్టారు. నిజంగా వారు తప్పు చేసి ఉంటే ముందు వార్నింగ్ ఇవ్వడం, తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడం చేయాలి.. అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలి. అంతేగానీ పైశాచికంగా ప్రవర్తించడం తప్పేనంటున్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండించాలని కోరుతున్నారు.