బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తో మరోసారి అంతర్జాతీయంగా తెలుగు పరిశరమ కీర్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈసినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రభాస్ పలు భాషల్లో ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే తమిళ్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రభాస్ ని ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం జగన్ గురించి చెప్పాలని కోరారు. ఏపీ ఎన్నికల్లో 151 సీట్లతో రికార్డు మెజారిటీ దక్కించుకున్న జగన్ దేశవ్యాప్తంగా పొలిటికల్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేశారు.. తమిళనాడులో జగన్ ను పొలిటికల్ బాహుబలిగా పిలుస్తున్నారని, ఆయన గురించి చెప్పాలని యాంకర్ ప్రభాస్ ని ప్రశ్నించాడు..
దీనికి ప్రభాస్ మాట్లాడుతూ రాజకీయాల గురించి తనకు పెద్దగా తెలియదని, అయితే యంగ్ సీఎంగా ఆయన చాలా బాగా చేస్తున్నాడని, జగన్ హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. జగన్ ప్రభుత్వాన్ని నడిపిస్తాడనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అలాగే ఎలక్షన్ టైంలో కూడా వైసీపీ ఫ్యాన్స్ జగన్ ని పొలిటికల్ బాహుబలిగా అభివర్ణించారు. ముఖ్యంగా టీడీపీ నేతలను కాలకేయులిగా జగన్ ని ప్రభాస్ ఊహించుకుని వీడియోలు తయారు చేసారు. అవి కూడా సోషల్ మీడియా ప్రచారానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు స్వయంగా బాహుబలే జగన్ గురించి పొగడటంతో వైసీపీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే ఇప్పటివరకూ ఇండస్ట్రీ నుంచి కేవలం మహేశ్ అభిమానుల సపోర్ట్ మాత్రమే జగన్ కు ఉండేది. ఇప్పుడు తాజాగా ప్రభాస్ చేసిన వ్యాఖ్యలతో జగన్ కు ఆయన అభిమానుల మద్దతు కూడా భారీగా పెరుగుతోంది. గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి వైరల్ అవుతున్న ఫొటోలే ఇందుకు నిదర్శనం.