టీమిండియా కోచ్ కు సంభందించి జరిగిన ఇంటర్వ్యూలో మళ్ళీ రవిశాస్త్రినే పాస్ అయ్యాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై లోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. చివరికి అందరు అనుకున్నట్టుగానే మళ్ళీ రవిశాస్త్రినే కోచ్ గా ఎన్నుకుంది కపిల్ దేవ్ తో కూడిన కమిటీ. దీంతో రవిశాస్త్రి మళ్ళీ ఇండియా కోచ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. 2021 వరకు ఆయనే జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తాడు. అయితే కోచ్ పదవీకాలం పూర్తి అయిన తర్వాత నుండి అందరి నోట కొత్త కోచ్ ఎవరు రాబోతున్నారు అనే ఆలోచన మొదలైంది. ఆ సమయంలోనే విరాట్ కోహ్లి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. అదేమిటంటే మళ్ళీ కోచ్ రవిశాస్త్రినే ఉంటే బాగుంటుందని అతనితో మాకున్న సంబంధం కూడా బాగుందని అన్నాడు. అయితే బీసీసీఐ చెప్పిన ప్రకారం కోచ్ విషయంలో ఎవరు చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకోమని చెప్పుకొచ్చింది. కాని ఇప్పుడు కోహ్లి చెప్పినట్టుగానే వారు వ్యవహరించారని అభిమానులు సైతం మండిపడుతున్నారు. దీంతో విరాట్ సాధించిన రికార్డులు పక్కన పెట్టి ఇప్పుడు విరాట్ పై విమర్శలు కురిపిస్తున్నారు.