కమిషన్ల సంస్కృతి భట్టి విక్రమార్క దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి బట్టి విక్రమార్క లేదని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క పై విమర్శలు సంధించారు. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి నేడు ప్రపంచమే అబ్బర పడుతుందని వారన్నారు. భవిష్యత్తులో కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా మా రాబోతుందని వారు తెలిపారు.
గోదావరి జలాలను ఒడిసిపట్టి అధునాతన టెక్నాలజీతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు రెండు పంటలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఓర్వలేక నీ సిల్ఫీ పదవి పోయిందని అక్కసుతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేయడం నీ స్థాయి కాదని ఆయన హెచ్చరించారు. హైదరాబాదులో మీ పదవి పోయేసరికి మధిర కు వచ్చి మధిర మున్సిపాలిటీని మేము అభివృద్ధి చేస్తామని బ్రోకర్లను వెంట వేసుకొని తిరిగినంత మాత్రాన మధిర ప్రజలు నమ్మరని వారు పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ ని అభివృద్ధి చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని భవిష్యత్తులో కూడా టిఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధిస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నతమైన వ్యక్తులు గురించి అవాకులు… చవాకులు మాట్లాడేటప్పుడు విజ్ఞతతో ఆలోచించాలని హితవు పలికారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 24 గంటల కరెంటు అందించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అతిత్వరలోనే ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. jalimudi ప్రాజెక్టు లో ఎవరు కమిషన్లు తీసుకుంది ప్రజలకు తెలుసని… ఇప్పటికైనా ఎవరి స్థాయి ఏమిటో
గమనించుకొని మాట్లాడాలని వారు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు దేవిశెట్టి రంగారావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ,టిఆర్ఎస్ జిల్లా నాయకులు కోటా రాంబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శీలం వీర వెంకట రెడ్డి, టిఆర్ఎస్ రైతు సమన్వయ సమితి నాయకులు యన్నం కోటేశ్వరరావు తేళ్ల వాసు, నాగార్జున్, మొండితోక జయకర్, కనుమూరి వెంకటేశ్వర్లు, కర్నాటి శ్రీను, కటికల సీతారామరెడ్డి,చిత్తారు నాగేశ్వరరావు, భోగ్యం ఇందిరా, నెల్లూరు రవి,మాదల రామారావు తదితరులు పాల్గొన్నారు.
Tags batti vikramarka kaleshwaram kcr khammam lingala kamalaraj slider telanganacm telanganacmo trsgovernament zp