ఇటీవల సంబంధిత అధికారితో మాట్లాడటానికి వెళ్లిన సందర్భంగా తనతో ఆయన సరిగా వ్యవహరించలేదని జయదేవ్ వాపోతున్నారు. ఆ అధికారి సరైన రీతిలో స్పందించలేదుని, ఎంపీ అయిన తను మాట్లాడుతున్నప్పటికీ తల వంచుకుని తన పని చేసుకుంటూ ఉన్నారట దీంతో హర్టయిన గల్లా జయదేవ్ ఆయన్ను మందలించి.. అక్కడి నుంచి వచ్చేశారట. అనంతరం తన సన్నిహితులతో తనకు అవమానం జరిగిందని వాపోయినట్లు తెలుస్తోంది.
ఎంపీకి ఇవ్వాల్సిన కనీస ప్రొటోకాల్ మర్యాదలు కూడా పాటించకపోవడం ఏంటని జయదేవ్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉందని ఎంపీకి కనీస మర్యాద ఇవ్వడం లేదని జయదేవ్ వాపోయారు.