Home / ANDHRAPRADESH / చంద్రబాబు పాలన తాలూకా మచ్చలు ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా వెలుగులోకి.. మామూలు ఘనకార్యాలు చేయలేదుగా

చంద్రబాబు పాలన తాలూకా మచ్చలు ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా వెలుగులోకి.. మామూలు ఘనకార్యాలు చేయలేదుగా

కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయని, వాటిని భారత ప్రభుత్వం పోలీసులు, ఆర్మీ సహాయంతో అణచి వేస్తుందంటూ కొందరు ఓ ఫొటోతో భారీఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్ తనయుడు ట్విట్టర్ లో ఈ ఫొటో ట్వీట్ చేశారు. కశ్మీర్‌లో భారత ఉగ్రవాదం పతాక స్థాయికి చేరుకుందని కామెంట్ చేశారు.. అలాగే పాక్‌ కు చెందిన జాతీయ భద్రతా విశ్లేషకులు జమీద్ హమీద్ ఇమ్రాన్ ఖాన్ బాగా చూడండి ఈమె మీ కూతురులాంటిది కాదా.? ఆర్ఎస్ఎస్ గ్యాంగ్‌స్టర్స్ భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి కశ్మీర్ మహిళలను కిడ్నాప్ చేస్తున్నారని, ఇలాంటి పిచ్చి చర్యలు ఆపాలని మోదీకి చెప్పాల్సిన సమయం ఇది కాదా.? అని ట్వీట్ చేశారు. అలాగే కశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం అంటూ చాలామంది ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్‌ ఇమేజ్‌లో కూడా ఈ ఫొటో అప్‌లోడ్ చేస్తే కశ్మీర్ ఆందోళనకు సంబంధించిన ఫొటోగానే కనిపిస్తోంది.

అయితే ట్విస్ట్ మొత్తం ఇక్కడే ఉంది.. అసలు ఈ ఫొటోకు కశ్మీర్ కు ఎలాంటి సంబంధం లేకపోగా ఈ ఫొటో ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు జరిగిన లాఠీ చార్జ్ కు సంబంధించినది.. అలాగే పోలీస్ బ్యాడ్జ్ కూడా యూనిఫాంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని బ్యాడ్జ్‌ స్పష్టంగా తెలుస్తోంది. కశ్మీర్ పోలీసు బ్యాడ్జ్ కు, ఏపీ పోలీస్ బ్యాడ్జ్ కు చాలా తేడాఉంది. ఈ ఫొటో మాత్రం 2016 జూలైలో ఏపీలో సంక్షేమ హాస్టళ్ల మూసివేతపై ఎస్‌ఎఫ్ఐ విద్యార్థులు విజయవాడలో నిరాహార దీక్షలు చేసినపుడు పోలీసులు ఎస్ఎఫ్ఐ విద్యార్ధులను అక్రమంగా అరెస్ట్ చేసినప్పటి ఫొటో ఇది. ఇది కనిపెట్టిన పలువురు పాకిస్తాన్ నెటిజన్లు వాస్తవాన్ని ఇతరులకు తెలియజేస్తూ చంద్రబాబు చేసిన ఘన కార్యాన్ని ఉదహరిస్తున్నారు. ప్రముఖ జాతీయ మీడియా బీబీసీ కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా తమ తెలుగు వెబ్సైట్ లో ప్రచురించింది. అయితే మన బాబు గారి పవర్ ఇదే.. ఆయన ఖ్యాతి ఆయన పాలన తాలూకా మచ్చలు భారతదేశంలోనే కాక ఇదర దేశాల్లోనూ వర్ధిల్లుతోందని వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు విమర్శిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat