ఆయన సీనియర్ పోలిటీషియన్.. అంతకంటే మాజీ హోమ్ మంత్రి.. మాజీ రాజ్యసభ సభ్యులు.. అయితేనేమి కాలం కల్సి రాక అప్పటి ఉమ్మడి ఏపీలో 1995-2004వరకు దాదాపు పదేళ్ల పాటు ఆధికారంలో ఉండి.. ఆ తర్వాత పదేళ్ల (2004-2014) పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది.
తీరా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో జరిగిన తొలి రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక అంతే తమ పార్టీ అధినేత దగ్గరకెళ్ళి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశం తెచ్చుకున్నారు. అయిన కానీ తాజాగా ఆయనుంటున్న పార్టీలోని సీనియర్ నేతలందరూ తమ తమ రాజకీయ భవిష్యత్తుకోసం వేరే వేరే పార్టీల వైపు చూస్తోన్నారు.
ఈ నేపథ్యంలో తను కూడా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇంతకూ అతను ఎవరు అని ఆలోచిస్తున్నారా.. ఆయన ఎవరో కాదు అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాయాంలో హోమ్ మంత్రిగా పనిచేసిన మాజీ ఎంపీ టి. దేవెందర్ గౌడ్ గురించే.ఈ నేత తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనతో పాటు తనయుడ్ని కూడా బీజేపీలో చేరాలని.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.