ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియా తనదైన శైలిలో మంచి ఆటను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్స్ గా భరిలోకి దిగిన ఈ టీమ్ సెమీస్ లో వెనుతిరిగింది. చివరికి ఆతిధ్య జట్టు ఐన ఇంగ్లాండ్ నే కప్ కైవశం చేసుకుంది. వరల్డ్ కప్ తరువాత ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి సిరీస్ ఇదే. ఈ మేరకు ఇప్పటికే మొదటి టెస్ట్ ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ, ఈ గెలుపుకి ముఖ్యపాత్ర పోషించింది మాత్రం స్మిత్ నే. తనే కాని లేకుంటే మొదటి టెస్ట్ ఆసీస్ దారుణంగా ఓడిపోయేది. ఒక్కప్పుడు ఆస్ట్రేలియా అంటే ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఆటతో టీమ్ ను ముందుకు నడిపేవాడు. కాని ఇప్పుడు మాత్రం పేలవ ప్రదర్శన తో టీమ్ ను కష్టాల్లో పడేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ రెండో టెస్ట్ ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాల్సిందే.
