వాళ్లిద్దరూ మంత్రులు.. యువ ఎమ్మెల్యేలుగా, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచే నాయకులుగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్లుగా, యాంగ్రీ యంగ్ మెన్లుగా వైసీపీ హీరోలుగా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో వీళ్ల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. సినీ సెలబ్రిటీలకు మించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ వీళ్లకు ఉన్నారు. వాళ్లిద్దరూ ఎవరనుకుంటున్నారా.. ఒకరు నెల్లూరు ఎమ్మెల్యే, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మరొకరు గుడివాడ ఎమ్మెల్యే, పౌర సరఫరాలశాఖామంత్రి కొడాలి నాని.. తాజాగా కురిసిన వర్షాలకు కృష్ణమ్మలోకి నీరు పోటెత్తుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ చేసిన ఓ పని ఫొటో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలే అత్యంత బలమైన సోషల్ మీడియా సైన్యం ఉన్న వైసీపీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఫోటోను వైరల్ చేస్తున్నారు. వరద ఉదృతిని నేరుగా పరిశీలించేందుకు నది వద్దకు చేరుకున్న వీరు కృష్ణానది కరకట్టకు చేరుకుని వరద ముంపును నివారించేందుకు విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ పై నిలబడ్డారు. వాస్తవానికి ఇది చాలాపెద్ద సాహసం.. కచ్చితంగా ధైర్యం ఉండాలి.. కారణం.. ఈ వాల్ సుమారుగా 50 అడుగుల పైనే ఉంటుంది.. నదిలో నుండి చూస్తే ఓ మోస్తరు రెండు తాటి చెట్లంత హైట్ ఉంటుంది.. ఈ వాల్ పైనుండి మామూలుగా నేలమీదకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి.. అలాంటిది అత్యంత ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూస్తే ఇంకా అంతే.. అయితే ఇలాంటివి ఈ ఇద్దరు మంత్రులకు సర్వ సాధారణమేనని, డేరింగ్ డాషింగ్ ఎమ్మెల్యేలే కాదు.. గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువంటూ వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు ఈ ఫొటోకు పెద్దఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు.