ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా జగన్ 50రోజుల పాలనపై దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, నూత విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల అంశం, పాలనా విధానం, గ్రామ వలంటీర్ల నియామకం, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణ, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అనేక అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను దరువు టీం తీసుకోవడం జరిగింది.
ఈ సర్వే ఫలితాలను కొద్దిరోజుల క్రితం దరువు పాఠకులకు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై చేసిన సర్వే ఫలితాలను పర్సంటేజ్ ల వారీగా వెల్లడించడం జరిగింది. అయితే దరువు సర్వే ఫలితాలు విడుదల చేసిన దాదాపుగా ఐదు రోజులకు వీడీపీ దేశ్ కా మూడ్ పేరుతో వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన ఓ సర్వేలో జగన్ మోహన్ రెడ్డి 3వ స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్ (81శాతం), యోగి ఆదిత్యనాథ్ (72శాతం), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (71శాతంతో) వరుస మూడు స్థానాల్లో నిలిచారు. దేశ్ కా మూడ్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 11,252 మంది పాల్గొన్నారని ఆసంస్థ తెలిపింది. ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 14 వరకూ మొత్తం 14 రాష్ట్రాల్లో సర్వే చేశారు. మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసారు. అప్పటినుంచి సంచలన నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు. తన పార్టీ మేనిఫెస్టోలో సెట్టిన నవరత్నాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పనితీరు పట్ల ప్రజలు ఆనందంగా, సంతృప్తిగా ఉన్నారని స్పష్టమవుతోంది. దరువు సర్వేలో కూడా ఇవే ఫలితాలు వెల్లడికావడం విశేషం.