ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ తరువాత ఆడుతున్న మొదటి సిరీస్ ఆస్ట్రేలియాతోనే. మొన్న జరిగిన ప్రపంచ కప్, క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ లోనే జరిగింది. ప్రపంచ కప్ ఆరంభంలో ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన ఈ జట్టు చివరికి అనూహ్య రీతిలో కప్పు సాధించింది. అయితే ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది మాత్రం ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ నే. టోర్నమెంట్ ప్రారంభంలో లీగ్ దశలో తడబడుతున్న ఇంగ్లాండ్ ను రూట్ నే గట్టెక్కించాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు రూట్ జట్టు సారధిగా వ్యవహరిస్తున్నాడు. కాని జట్టులో కెప్టెన్ గా తన పాత్ర మాత్రం శూన్యం అనే చెప్పాలి. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిపోయిన ఇంగ్లాండ్ ఇప్పుడు రెండో మ్యాచ్ కూడా అలానే ఉందని తెలుస్తుంది. ఒక్కప్పుడు రూట్ టాప్ ప్లేయర్ అలాంటిది ఈ ఆటగాడి చివరి టెస్ట్ సెంచరీ 2017లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కొట్టాడు. తన ఆటను ఇలానే కొనసాగిస్తే తన కెప్టెన్సీ పై ప్రభావం చూపుతుందని సీనియర్ ఆటగాలు భావిస్తున్నారు.