కీర్తి సురేష్..టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన మొదటి సినిమాతోనే ఈ అందాల భామ నటనతో, అందంతో మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం హీరో నాని, పవన్ కళ్యాణ్ సరసన నటించింది. అనంతరం ఒక్కసారిగా దిగ్గజ నటి ఐన సావిత్రిగారి పాత్రలో నటించే అవకాశం ఆమెకు దక్కింది. మొదట ఈ సినిమా తానూ సరిపోనేమో అని భావించినా చివరకు అదే ఇప్పుడు తన కీర్తి ప్రతిష్టలను పైకి లేపింది. అనుకున్న విధంగానే ఆమె ఇందులో నటించింది.. తన నటనకి యావత్ ప్రపంచం ఫిదా అయిపోయిందని చెప్పాలి. ఈ సినిమాతో కీర్తి సురేష్ గా పిలవబడే తన పేరు మహానటిగా మారిపోయింది. దీంతో ఈ సినిమాకు సంభందించి తన నటనకు గాను జాతీయ అవార్డు తనను వరించింది. దీంతో కీర్తి సంతోషానికి అడ్డూ అదుపూ లేదని చెప్పాలి.
ఇక తాజాగా ఈ భామ ఖతార్ లో జరుగుతున్న సైమా ఈవెంట్ కు హాజరయ్యింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. అక్కడికి వచ్చిన చిరంజీవి వద్దకు కీర్తి వచ్చి కాళ్ళ మీద పడింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారు అనే విషయానికి వస్తే అప్పట్లో చిరంజీవి సరసన పున్నమినాగు సినిమాలో కీర్తి సురేష్ తల్లి మేనక సురేష్ కుమార్ నటించిందని తనతో అప్పటి విషయాలు గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కీర్తి నటన విషయంలో ప్రశంశలు జల్లు కురిపించారని తెలుస్తుంది.