తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పని చూసి అందరు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ పని ఏంటంటే 73 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పథకాలను సీఎం చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంలో అందరూ వచ్చి సీఎంతో సత్కారం అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ మెడల్ ఒకటి కింద పడింది. ఇది గమనించని సదరు ఆఫీసర్ కవాతు చేసుకుంటూ సీఎం నుండి ముందుకు వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కిందకు వంగి ఆ పతాకాన్ని తీసి అక్కడే ఉన్న అధికారికి అందజేసారు. ఈ విషయాన్ని కొందరు వీడియో, ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ ఘటనతో అంతా శభాష్ జగన్ అని మెచ్చుకుంటున్నారు. గతంలో జగన్ ను వ్యతిరేకించినవారు కూడా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.. గతంలో అదే స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారం చేసినపుడు కూడా తనను స్టేడియం మొత్తం తిప్పుతూ ప్రజలకు అభివాదం చేసేలా తన జీపు నడిపిన పోలీసును కూడా జగన్ ఇలాగే తన చేతితో భుజంపై తడుతూ అభినందించారు. గతంలో వైఎస్ కూడా తన వ్యక్తిగత సహాయకులను, పోలీసులను సిబ్బందిని కూడా ఆప్యాయంగా పలకరించడంతోపాటు వారికి భరోసానిచ్చేవారు.