రెజీనా కాసాండ్రా.. ఈ పేరు టాలీవుడ్ లో అందరికి బాగా పరిచమయిన పేరు. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఈమె మూడు బాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ బాషల్లో నటించింది. ఎస్ఎంఎస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, కృష్ణయ్య, పవర్, ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించినప్పటికే పెద్దగా హిట్ కాకపోవడంతో ఇండస్ట్రీ లో పైకి రాలేకపోయిందని చెప్పాలి. అయితే నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ఎవరు’ సినిమా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం మంచి థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ కావడంతో బాగుందనే టాక్ వచ్చింది. ఈ భామకు సరైన అవకాశాలు రాకపోవడంతో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మంచి ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. ఐన ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. అయితే దీనిపై స్పందించిన యువత ఇలాంటి ఫోటోలు పెడితే ఎవరూ ముందుకు రారు, ఇంకా పిచ్చేకించే అందంతో కనిపించేలా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
