ప్రస్తుతం భారత్ జట్టు మంచి జోరుమీద ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయిన తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కి వెళ్ళింది. మొదట టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. ఇందులో భారత్ నే ఆదిపత్యం సాధించిది. ఇటు వన్డేల్లో కూడా భారత్ నే పై చెయ్యి గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ టూర్ కి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్లేస్ లో యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ కు అవకాశం ఇచ్చారు. దీంతో అందరి దృష్టి ఫ్యూచర్ వికెట్ కీపర్ పైనే పడ్డాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేసి ఆసలు నిరాశ చేసాడు. అటు టీ20, ఇటు వన్డేల్లో కూడా తనదైన శైలిలో ఆడలేకపోయాడు. దీంతో వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నాడని క్రికెట్ అభిమానులు, మాజీలు అంటున్నారు. ఇలానే ఆడితే ముందు ముందు చాలా కష్టం అవుతుందని అంటున్నారు.