ఇప్పుడు తెలుగుదేశం నేతలందరూ చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది.. కావాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే.. ప్రకాశం బ్యారేజ్ మొత్తం నీటి నిల్వ సామర్ద్యం 3 టీఎంసీల పైనే.. కానీ ప్రస్తుతానికి నిల్వచేస్తున్నది మాత్రం కేవలం 2 టీఎంసీలు మాత్రమే.. అంటే తాగు, సాగునీటి అవసరాలకోసం మరొక టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే సామర్ద్యం ఉన్నా నిల్వ చేసుకోలేకపోవడానికి కారణం చంద్రబాబే.. ఇది నూటికినూరుశాతం నిజం. ఇప్పటికే కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా నిల్వ చేసుకోలేకపోవడానికి కారణం కరకట్ట పై కట్టిన అక్రమ కట్టడాలు మునిగిపోతాయనే కారణంతోనే.. చంద్రబాబు నాయుడి హయాంలో వారు ప్రదర్శించిన దుర్బుద్ధి ఎంత దారుణంగా ఉండేదంటే.. కేవలం అతికొద్ది మంది అక్రమార్కుల అక్రమ కట్టడాలు మునిగిపోతాయనే ఒకే ఒక్క కారణంతో లక్షలమందికి ఉపయోగపడే సాగు, తాగు నీటిని పణంగా పెట్టారు. బ్యారేజ్ లో నీరు నిల్వ చేసి రైతులకు సాగు, ప్రజలకు తాగు నీరు ఇవ్వాలని నీరు లేకుండా చేసారు. అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో చంద్రబాబు హయాంలో వర్షాలు కూడా కురవకపోవడం మరో విశేషం.