తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజధాని నగరం హైదరాబాద్ లోని గోల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జాతిని ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..”
1)ఆర్థికాభివద్ధి
తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గడిచిన ఐదేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్నది. ప
టిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతి లేకుండా ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం.
కేంద్ర నివేదిక ప్రకారం, 2018-19లో 14.84 శాతం వృద్దిరేటుతో జి.ఎస్.డి.పిలో మన రాష్ట్రం
ముందు ఉంది.
ఆదాయ వృద్ధిలో స్థిరత్వం వల్ల రాష్ట్ర సంపద ఐదేళ్లలో రెట్టింపయింది.
మొదట్లో 4 లక్షల కోట్లుంటే, నేడు 8.66 లక్షల కోట్లకు చేరుకుంది.
……………….
2)ప్రగతి ప్రస్థానం
రాష్ట్రంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తున్నాయి.
పేద ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాం.
కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా చేసుకోగలిగాం.
దీర్ఘకాలికంగా తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలను
సాధించుకోగలిగాం.
ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షించగలిగాం.
………..
3)పరిపాలనలో సంస్కరణలు
గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం
శ్రీకారం చుట్టింది.
గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను ఇప్పుడు 33 జిల్లాలుగా ఏర్పాటు చేశాం.
43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా
చేసుకున్నాం.
గతంలో 68 మున్సిపాలిటీలుంటే, నేడు తెలంగాణలో 142 మున్సిపాలిటీలున్నాయి.
కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లతో కార్పొరేషన్ల సంఖ్యను 13కు పెంచుకున్నాం.
గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది.
గతంలో 8,690 గ్రామ పంచాయతీలుంటే, వాటి సంఖ్యను 12,751 కు పెంచాం.
……………….
4)కొత్త జోనల్ వ్యవస్థ
ఉద్యోగావకాశాలు స్థానికులకే ఎక్కువ దక్కాలనే లక్ష్యంతో కొత్త జోనల్ వ్యవస్థ.
లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా చట్టం
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు
………
5)కొత్త చట్టాలు
అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందించడానికి నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని,
నూతన పురపాలక చట్టం, రెవెన్యూ చట్టం
ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా, కొత్త రెవెన్యూ చట్టం
…………
6)60 రోజుల ప్రత్యేక కార్యాచరణ
గ్రామాలలో, పట్టణాలలో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
ఫైనాన్స్ కమిషన్ల గ్రాంటు నిధులను ఈ 60 రోజుల ప్రణాళిక అమలుకు ముందే స్థానిక
సంస్థలకు విడుదల
60 రోజుల ప్రణాళికలో ప్రజా ప్రతినిధులు, అధికారులు విశేషమైన ప్రజా భాగస్వామ్యం సాధించి
గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి.
…………..
7)పవర్ వీక్
గ్రామాలు, పట్టణాల పరిసరాల్లోనూ కరెంటు సమస్యలను నివారించడానికి పవర్ వీక్
నిర్వహించుకోవాలి.
వంగిన పోళ్లను సరిచేయాలి. తుప్పు పట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్త పోళ్లు వేయాలి.
వేలాడే వైర్లను సరిచేయాలి. అన్ని గ్రామాలకు, పట్టణాలకు అవసరమైన స్తంభాలు, వైర్లను
ప్రభుత్వమే సమకూరుస్తుంది.
………….
8)పచ్చదనం పెంచే కార్యక్రమం
ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామం తమకు అవసరమైన నర్సరీలను స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే
ఏర్పాటు చేసుకోవాలి.
మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలలో జిల్లా గ్రీన్ కమిటీ (హరిత కమిటీ)
అందించే సూచనలను ఖచ్చితంగా పాటించాలి.
పట్టణ, గ్రామ బడ్జెట్ లో 10 శాతం నిధులను పచ్చదనం పెంచే పనుల కోసం కేటాయించాలి.
నిర్దిష్టమైన విధానంలో గ్రీన్ కమిటీ సూచనల మేరకు మొక్కలు నాటాలి. ప్రజల చేత
నాటించాలి.
పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతీ ఇంటికీ ప్రజలు కోరుకునే ఆరు మొక్కలను సరఫరా చేయాలి.
ప్రజలంతా ఆ మొక్కలను చక్కగా కాపాడి పెంచి, పెద్ద చేసే ప్రేరణ కలిగించాలి.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేసుకున్నాం. దివ్యాంగులకు 3016
రూపాయలు, ఇతరులకు 2016 రూపాయల పెన్షన్ అందించుకుంటున్నాం.
వృద్దాప్య పెన్షన్ వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన
పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
………………
9)వ్యవసాయం – రైతు సంక్షేమం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతాంగ విధానం యావత్ దేశానికి ఆదర్శం
ప్రపంచ వ్యాప్తంగా అమలయ్యే గొప్ప కార్యక్రమాల జాబితాలో మన రైతుబంధు, రైతు
బీమాలకు ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
మన రాష్ట్రానికి ప్రశంసలు అందించింది. ఇది మన రాష్ట్ర రైతు లోకానికి, మనందరికీ
గర్వకారణం.
రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8వేల నుంచి 10వేల
రూపాయలకు పెంచి, అందిస్తున్నాం.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ
చేయబోతున్నాం.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకున్నాం.
……….
10)కాళేశ్వరం ప్రాజెక్టు
వడివడిగా రూపుదిద్దుకుంటున్న కృష్ణ, గోదావరి ప్రాజెక్టులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి.
ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టును ఈ మధ్యనే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రుల సమక్షంలో సగర్వంగా ప్రారంభించుకున్నాం.
పరిపాలనా పరిణతికి, దౌత్యనీతికి, స్నేహ సంస్కారానికి ప్రతిబింబంలా నిలిచిన కాళేశ్వరం
ప్రాజెక్టు దేశానికి గొప్ప సందేశం ఇచ్చిందని యావత్ దేశం కొనియాడుతున్నది.
తెలంగాణ రాష్ట్రం అవలంభిస్తున్న లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ అన్ని రాష్ట్రాలకు
అనుసరణీయమైన విధానమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే కనీసం 15-20 ఏళ్లు పడుతుంది.
కానీ ఎండనూ, వాననూ, చలినీ లెక్క చేయకుండా రాత్రనకా పగలనకా మూడు షిఫ్టులు
శ్రమించి, మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి
చేసిన ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు, ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక
అభినందనలు తెలుపుతున్నాను.
కార్యసాధకులందరికీ వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
…
11)అదనంగా 575 టిఎంసిలు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా 400 టిఎంసిల నీటిని నికరంగా ఉపయోగించుకునే
అవకాశం ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరివ్వడానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టిఎంసిలు,
ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరివ్వడానికి దేవాదుల ద్వారా 75 టిఎంసిల నీటిని నికరంగా
వాడుకోవడానికి వీలు కలుగుతుంది.
శరవేగంగా నిర్మాణమవుతున్న ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు
అందిస్తాం.
గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం ఇప్పుడున్న
గోదావరి ప్రాజెక్టులకు అదనంగా 575 టిఎంసిల నీటిని నికరంగా వాడుకుంటుంది.
…
12)పాలమూరు ప్రాజెక్టులు
పాలమూరు జిల్లాలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చాలా వేగంగా పూర్తి
చేసింది.
జూరాలతో కలిపి పాలమూరు జిల్లాలో నేడు 11 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు
అందించుకోగలుగుతున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చాలా వేగంగా
నిర్మించి ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా రైతులకు సాగునీరు
అందిస్తాం.
………..
13)కుల వృత్తులు
గ్రామీణ పరిశ్రమలకు, చేతివృత్తులకు ప్రభుత్వ విశేషమైన ప్రోత్సాహం ఇస్తున్నాం..
నేత, గీత తదితర వృత్తిదారుల సంక్షేమం కోసం కార్యక్రమాలు అమలు .
అన్ని వర్గాల ప్రజల పండుగలకు ప్రభుత్వం సమాన హోదా కల్పించింది.
అందరి మనోభావాలను గౌరవిస్తూ, గంగా జమునా తహజీబ్ ను ప్రభుత్వం చిత్తశుద్ధితో
పరిరక్షిస్తున్నది.
దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన పిల్లలకు ఉన్నత
ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్య అందించడానికి 906 గురుకుల పాఠశాలలు.
…
14)ప్రజావైద్యం
ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానం పేదల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతున్నది.
కేసీఆర్ కిట్స్ తో పాటు అందిస్తున్న నగదు ప్రోత్సాహం అద్భుతమైన ఫలితం సాధించింది.
రాష్ట్రంలో మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
కంటి వెలుగు కార్యక్రమం దృష్టిలోపాలు సరిచేసుకునేందుకు ప్రజలకు గొప్ప అవకాశం
కల్పించింది.
ప్రజలందరికీ సంపూర్ణంగా ఆరోగ్య పరీక్షలు జరిపి, ఆ ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య
సూచిక ‘హెల్త్ ప్రొఫైల్’ తయారు
…………
15)పరిశ్రమలు – ఐటి
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నది.
ఐటి అభివృద్ధి స్థిరంగా కొనసాగుతున్నది.
గడిచిన ఐదేళ్ళలో ఐటి ఎగుమతులు 52వేల కోట్ల నుంచి లక్షా 10వేల కోట్ల రూపాయలకు
చేరుకుంది.
ఇదే ఐటి రంగంలో మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతున్నది.
..
16)హైదరాబాద్ అభివృద్ధి
జంట నగరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం అవలంభిస్తున్నది.
పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను మరింత
పెంచుతాం..
మెట్రోరైలు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నది.
…
17)కొత్త రెవెన్యూ చట్టం
బూజు పట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులకు, ప్రజలకు అపారనష్టం కలిగించాయి.
అందుకే కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది.
నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెడతాం
..
18)శాంతి భద్రతలు
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ వరుసలో ఉన్న రాష్ట్రాల సరసన
చేరింది.
శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, జాతరలు, ఉత్సవాలు తదితర భారీ
కార్యక్రమాలను నిశితంగా గమనించేందుకు హైదరాబాద్ లో నిర్మిస్తున్న కమాండ్ అండ్
కంట్రోల్ సెంటర్ బిల్డింగ్.
నేరాల అదుపులో అద్భుత పనితీరు కనబరుస్తున్న యావత్ పోలీసు యంత్రాంగాన్ని ఈ
సందర్భంగా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
తెలంగాణలో సామరస్య వాతావరణాన్ని కొనసాగించే విషయంలో ప్రజల సహకారం కూడా
కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.
…
19)ముగింపు
పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత ఐదేళ్ళలో పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా
నిర్వహించాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ
కార్యక్రమాలను అమలుచేసాం. విద్యుత్తూ, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర మౌలిక
సదుపాయాల కల్పన చేసుకున్నాం. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రం గా దేశం ముందు గర్వంగా
నిలబడ్డది. బంగారు తెలంగాణా అనే సౌధం నిర్మించడానికి కావాల్సిన పునాదులు పడ్డాయి.
నీతిమంతమైన, నిబద్ధత తో కూడిన పారదర్శక పరిపాలన ద్వారా మన స్వప్నం మరింత
తొందరగా సాకారం అవుతుంది. అందుకే పాత చట్టాల బూజును తొలగించి వర్తమాన సామాజిక
స్థితిగతులకు సరిపోయే నూతన చట్టాలను ప్రభుత్వం అమలు లోకి తెస్తున్నది. ప్రభుత్వ
కార్యాలయాల్లో ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు చర్యలు
తీసుకుంటున్నది. స్వరాష్ట్రం లో సుపరిపాలన అనే నినాదంతో ముందుకు సాగుదాం.
సమున్నత లక్ష్య సాధన కోసం సాగుతున్న ఈ ప్రగతి ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు
కావాలి. భవిష్యత్తును సుందరంగా నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని
కోరుకుంటూ, మరోసారి రాష్ట్ర ప్రజానీకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలుపుతున్నాను.
జై హింద్! జై తెలంగాణ !! అని అంటూ తన ప్రసంగాన్ని ముగించారు..