తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,యువనేత కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కవిత రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు మాజీ ఎంపీ కవిత.
