భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ లో భాగంగా నిన్న ఆఖరి వన్డే జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న విండీస్ ఒక విధంగా చెప్పాలంటే ఓపెనర్స్ క్రిస్ గేల్, లూయిస్ టీ20 మ్యాచ్ ఆడారనే చెప్పాలి. గేల్ ఇండియన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ చివరికి గెలిచింది మాత్రం ఇండియానే. ఇక అసలు విషయానికి వస్తే ఈ విధ్వంసకర ఆటగాడికి ఈ మ్యాచ్ నే తన కెరీర్ లో చివరి మ్యాచ్ అని అందరు అనుకున్నారు. ఈ మేరకు గేల్ ఔట్ అయిన అనంతరం భారత్ ఆటగాలు వీడ్కోలు కూడా చెప్పారు. కాని మ్యాచ్ అయిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఈ ఆటగాడు రిటైర్మెంట్ పై స్పందించాడు. నేను ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంకా టీమ్ లోనే కొనసాగుతానని అన్నారు. అయితే ఇదివరకే గేల్ ప్రపంచ కప్ తర్వాత ఇండియాతో జరిగే సిరీస్ నే నాకు చివరిది అని తానే స్వయంగా చెప్పడంతో అందురు అతడికి ఇదే చివరి మ్యాచ్ అనుకున్నారు. అయితే వెస్టిండీస్ బోర్డు మాత్రం గేల్ వల్ల యువకులకు అవకాశం దక్కకుండా పోతుందని బావిస్తున్నారని సమాచారం.