టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. ఈ యువ కెరటం ప్రస్తుతం రికార్డులు బ్రేక్ చేసే పనిలోనే ఉన్నాడనే అనిపిస్తుంది. ఒక పక్క జట్టుకు సారధిగా వ్యవహరిస్తూ, మరోపక్క ఒంటిచేత్తో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. తరువాత రెండు మ్యాచ్ లు కూడా భారత్ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఇందులో చివరి రెండు మ్యాచ్ లలో కోహ్లి రెండు సెంచరీలు కొట్టాడు. దీంతో కోహ్లి శతకాలు సంఖ్య 43 కు చేరాయి. వన్డేల్లో ఇప్పటివరకు అత్యధికంగా సచిన్ టెండూల్కర్ 49 తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డు పక్కన పెడితే దీనికన్నా తిరుగులేని మరో రికార్డ్ కోహ్లి తన సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక దశాబ్ద కాలంలో ఎక్కువ పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. అంతకముందు ఈ రికార్డు రికీ పాయింటింగ్ పేరిట ఉండేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకోవడమే కాకుండా వేరెవ్వరు సాధించలేని ఫీట్లు లు కూడా కోహ్లి సాధించగలడు అనడంలో సందేహం లేదు.