ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్న పాప ఎవరో తెలుసా..? కచ్చితంగా కనిపెట్టలేరు. ఈ పాప 14 ఏళ్ల వయసులోని సినిమాలో నటించింది. ఆ తరువాత తన నటనతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో ఒక లెవెల్ లో ఉంది. ఆమె మరెవరో కాదు చార్మింగ్ గర్ల్ ఛార్మి. ఈమె సినీ రంగం అనుకోకుండా మొదలైంది. అతిచిన్న వయసులోనే నీతోడు కావాలి సినిమాలో నటించింది. అప్పటినుండి ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చింది. అనంతరం కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన చిత్రం శ్రీ ఆంజనేయం ద్వారా తెలుగు లో అడుగుపెట్టింది. అలా తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేసి తెలుగులో అందరి మన్నలను అందుకుంది. 2007 లో విడుదలైన మంత్ర అయితే ఛార్మీకి ప్రత్యేక స్థానాన్ని కట్టపెట్టింది. ఇలా చాలా చిత్రాల్లో నటించిన ఆమె కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. చివరికి ఇప్పుడు సినిమాలు చేయడం మానేసి నిర్మాతగా మారిపోయింది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ గా వ్యవరించింది.
