సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మంచి జోరు మీద ఉందని చెప్పాలి. ఇప్పటికే టీ20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే వారి పరువు దక్కించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ ఐన గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీమిండియా కు అంతా బాగానే ఉన్నప్పటికీ ఓపెనర్ ధావన్ కొంచెం కలవరపరుస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఈ డాషింగ్ ఓపెనర్ అటు టీ20లో విఫలం అయ్యాడు. ఇప్పుడు ఇందులో కూడా తడబడుతున్నాడు. బ్యాట్ లోనికి వచ్చే బంతులను ఎదుర్కోవడానికి బయపడుతున్నాడని చెప్పాలి. మరి ఈ చివరి మ్యాచ్ లో ఐన రాణిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.
