టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో మంచి జోరుమీద ఉంది.అటు కెప్టెన్ ఇటు వైస్ కెప్టెన్ ఇద్దరు భీకర ఫామ్ లో ఉన్నారనే చెప్పలే. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, డాషింగ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన వారిలో ఏడో స్థానంలో ఉన్నారు. 304 వన్డేలు ఆడిన యువీ 8701 పరుగులు చేసాడు. అయితే హిట్ మాన్ రోహిత్ మరో 26 పరుగులు చేస్తే యువీ రికార్డు ను క్రాస్ చేస్తాడు. ప్రస్తుతం రోహిత్ 217 వన్డేల్లో 8676 చేసాడు. ఈరోజు జరిగే చివరి మ్యాచ్ లో తడబడకుండా ఆడితే అతడు ఈ ఫీట్ సాధిస్తాడు. మరోపక్క భారత్ కెప్టెన్ రికార్డుల వీరుడు మొన్న జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేయడంతో కొన్ని రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు జరగబోయే చివరి మ్యాచ్ లో కోహ్లి 25పరుగులు చేస్తే మరో రికార్డు తన సొంతం చేసుకుంటాడు. అదేమిటంటే.. భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు విండీస్ బ్యాట్స్‌మన్ రామ్‌నరేశ్ పెరట ఉంది.
