ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిన నేపథ్యంలో తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాదాపు ముప్పై ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నడ్డా నేతృత్వంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ఈ రోజు బుధవారం ప్రకటించారు. గతంలో హైదరాబాదుకు అమీత్ షా వచ్చినప్పుడు కోనేరు సత్యనారాయణ కలుసుకుని బీజేపీలో చేరేందుకు తాను సిద్ధమేనని ప్రకటించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు నల్లగొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. పాల్వాయి రజనీకుమారి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, సాధినేని శ్రీనివాస్ రావు, కడారి అంజయ్య తదితరులు టీడీపీకి రాజీనామా చేశారు. తామంతా ఈనెల 18న బీజేపీలో చేరబోతున్నామని పాల్వాయి రజనీకుమారి తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని రజనీకుమారి ఈ సందర్భంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.