బెజవాడ కరకట్టమీద అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో గత నాలుగేళ్లుగా బాబుగారు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి కూడా వరద ముప్పు పొంచి ఉంది. దీంతో చంద్రబాబు సిబ్బంది నివాసంలోకి నీరు చేరకుండా ఇసుక బస్తాలు వేస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కి తరలించారు. ఇంట్లోని కింది గదుల్లో ఉన్న సామాన్లను మేడపైకి తరలించారు. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. అదే జరిగితే బాబుగారి ఇల్లు కూడా వరద ముంపుకు గురవడం ఖాయం. ప్రమాదం ముందే గ్రహించిన చంద్రబాబు కుటుంబంతో సహా హైదరాబాద్‌కు జంప్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. కృష్ణా నది కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడాలన్నీ వరద ముంపుకు గురవుతాయని…అవన్నీ తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కరకట్ట మీద అక్రమ కట్టడమైన బాబుగారి ఇంటికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా బాబుగారు మాత్రం కరకట్ట మీద ఉన్న తన ఇంట్లో ప్రజావేదికను ఇవ్వకుండా జగన్ కావాలనే కూల్చివేయించారని..ఇప్పడు తనను ఇంట్లో కూడా ఉండనీయడం లేదని ఆక్రోశం వెళ్లగక్కారు. చివరకు ఏమైంది..జగన్ చెప్పిందే నిజమైంది..కరకట్ట వరద ముంపుకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో బాబుగారు చడీ చప్పుడు కాకుండా సామాన్లు, కాన్వాయ్‌ని తరలించి…కుటుంబంతో సహా హైదరాబాద్‌కు జంప్ అయ్యాడు..అదండీ…బాబుగారికి ఏదైనా అనుభవంలోకి వస్తే కానీ తెలియదు..అంతేగా…అంతేగా..
