ఏపీ సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాలనలో అవినీతిని తగ్గించేందుకు సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అవినీతికి పాల్పడితే ఎటువంటి సీనియర్ మంత్రులైనా ఉపేక్షించేది లేదని…తొలి కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయిన సందర్భంగా…సీఎం జగన్ అవినీతిపై పోరాటంలో ఏ మాత్రం వెనకడుగు వేయద్దు అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…అవినీతిపై చేస్తున్న పోరాటంలో తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయితే వాటికి లొంగే ప్రసక్తే లేదని తెలిపారు. గత ఐదేళ్ల బాబుపాలనలో అవినీతి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు జరిగిందని..కానీ మన పాలనలో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని నిర్మూలించేందుకు సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నామని జగన్ చెప్పారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకువచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏది చూసినా వందలు, వేలకోట్ల రూపాయల కుంభకోణాలు కనిపిస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసినవారిని వదిలేయాలా? అని సీఎం జగన్ …గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై జరిపిస్తున్న విచారణలపై విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం విషయాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి ఉందని, అవినీతి లేకుండా అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి కదా? అని జగన్ అన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, దీనివల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందని అన్నారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని, ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దని సూచించారు.గత ఐదేళ్లలో బాబు ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ సందర్భంగా సీఎం జగన్ అవినీతిపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని…మరోసారి స్పష్టం చేశారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఎం జగన్ విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ ఉప సంఘం గత ఐదేళ్లలో జరిగిన అవినీతి, లొసుగులపై నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకునేందుకు జగన్ రెడీగా ఉన్నారని…ఏపీ అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మూలించి, పారదర్శక పాలన అందించేందుకు ఏపీ సీఎం జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు.